NLR: కావలి – ఉదయగిరి రహదారిపై మంగళవారం ఉందయం రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి వైపు నుంచి వస్తున్న గొర్రెల వాహనాన్ని ఉదయగిరి వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమవ్వగా.. ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.