అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల గురించి ప్రశ్నించగా.. ముఖ్యంగా వాటిపై ఆసక్తి లేదని వెల్లడించారు. తాత అమెరికన్ అయినప్పటికీ తాను పుట్టింది ఆఫ్రికాలోనని గుర్తు చేశారు. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి న్యాయపరమైన, వ్యక్తిగత కారణాలున్నాయని పేర్కొన్నారు.