VZM: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లెపండగలో భాగంగా సోమవారం సాయంత్రం శాసనసభ్యురాలు పూసపాటి అదితి గజపతి రాజు “పల్లె బాట” కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండకరకాం, ద్వారపూడి, గుంకలాం, జొన్నవలస మరియు దుప్పాడ గ్రామాలలో పర్యటించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించే అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.