సెన్సిటివిటీ, పిప్పి పళ్ల వల్ల పంటి నొప్పి సమస్య వస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి ఆ నీటితో పుక్కిలించడం వల్ల పంటి నొప్పి నుంచి రిలీఫ్ కలుగుతుంది. లవంగాలను మెత్తగా చేసి నొప్పి ఉన్న చోట పెట్టినా మంచి ఫలితం ఉంటుంది. ఓ పాత్రలో కొద్దిగా పసుపు, రాళ్ల ఉప్పు, ఆవాల నూనె వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని పంటి నొప్పి ఉన్న చోట రాస్తే మంచిది.