JN: జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ భష ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.