భూటాన్లోని పారో ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర విమానాశ్రయాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 మంది పైలెట్లు మాత్రమే ఇక్కడ విమానాన్ని ల్యాండ్ చేయడానికి అర్హత సాధించారు. పారో ఎయిర్పోర్ట్ చుట్టూ 18,000 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలుంటాయి. రన్వే పొడవు కేవలం 7,431 అడుగులు మాత్రమే ఉండగా.. రాడార్ గైడెన్స్ లేకుండా నడపగలిగే పైలట్లు ఇక్కడ అవసరం.