తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూసే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలలో ముఖ్య ఘట్టం ‘రంగం భవిష్యవాణి’ ఆషాఢమాసంలో లష్కర్ బోనాల రెండు రోజుల జాతరలో రంగం కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సోమవారం ఉదయం 8: 30 గంటలకు స్వర్ణలత భవిష్యవాణి వినిపించనుంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కారణంగా ఈ ఏడాది ఈ కార్యక్రమం గురించి భక్తుల్లో కొంత ఆసక్తి నెలకొంది.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఉత్సవం ఆదివారం భక్తుల జనసందోహం నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బోనాల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారు బంగారు కిరీటం, కాసులపేరు, వజ్రాల ముక్కుపుడక, మంగళసూత్రాలు, లక్ష్మీ లాక్కెట్లతో దివ్యమంగళ స్వరూపిణిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఎటువంటి ఆటంకం కలగకుండా రాత్రి వరుకు విద్యుత్దీపకాంతుల నడుమ భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు
వచ్చే ఆదివారం జూలై 28 న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు జరగనున్నాయి. 29వ తారీఖున లాల దర్వాజా అమ్మవారి రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు.