»Disturbance Involving Kids Turns Into Violent Protest In Leeds
UK Riots: హింసాత్మకంగా మారిన యూకే అల్లర్లు.. ప్రజలకు హోంమంత్రి అభ్యర్థన
యూకేలోని లీడ్స్ నగరం సమీపంలో ఉన్న హేర్హిల్స్ ప్రాంతంలో గురువారం హింస చెలరేగింది. ఈ ఘటనలో నిరసనకారులు ఒక బస్సుకు నిప్పు పెట్టారు. ఒక పోలీసు కారును ధ్వంసం చేశారు.
Disturbance Involving Kids Turns Into Violent Protest In Leeds
UK Riots: యూకేలోని లీడ్స్ నగరం సమీపంలో ఉన్న హేర్హిల్స్ ప్రాంతంలో గురువారం హింస చెలరేగింది. ఈ ఘటనలో నిరసనకారులు ఒక బస్సుకు నిప్పు పెట్టారు. ఒక పోలీసు కారును ధ్వంసం చేశారు. వెంటనే స్పందించిన వెస్ట్ యార్క్‌షైర్ పోలీసులు అల్లర్ల తీవ్రతను గమనించి భద్రతను పెంచారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యూకేలోని స్కై న్యూస్ వెస్ట్ యార్క్‌షైర్ పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదని, ఇది కొందరు ఆకతాయులు చేసిన దుశ్చర్యగా పోలీసులు పేర్కొన్నారు.
దీనిపై యూకే హోమ్ సెక్రటరీ యెవెట్ కూపర్ మాట్లాడుతూ.. ప్రమాద దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ఈ మేరకు ప్రజలకు ఎవరు రోడ్లమీదకు రావద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అంతవరకు ప్రజలు సంయమనము పాటించాలని పేర్కొన్నారు. ఈ అల్లర్లు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. పోలీసు కారుపై దుండగులు దాడి చేయడంతో అది బోల్తా పడినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
🚨🇬🇧 Today in Britain:
– Stabbing in broad daylight – Wigan – Police cars & buses destroyed – Leeds – Riots in #London
లీడ్స్ నగరంలోని హేర్హిల్స్ ప్రాంతంలో లక్సర్ స్ట్రీట్‌లో సాయంత్రం 5 గంటలకు ఏజెన్సీ కార్మికులు, కొంతమంది పిల్లలు నిరసనలు చేపట్టారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ వాళ్లను వెనక్కి వెళ్లమన్నారు. అంతలోనే ఇతర గ్రూపులు నిరసనలో చేరడంతో స్పందించిన భద్రత బలగాలు పిల్లలకు, ఏజెన్సీ కార్మికులను సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఈ తరువాత పరిస్థితి చేయిదాటిందని పోలీసులు తెలిపారు. దీన్ని త్వరలోనే అదుపులోకి తీసుకోస్తామని పోలీసులు పేర్కొన్నారు.
🚨🇬🇧 Today in Britain:
– Stabbing in broad daylight – Wigan – Police cars & buses destroyed – Leeds – Riots in #London