Chhattisgarh Naxal Encounter : ఛత్తీస్‌ఘడ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉంది. చికుర్‌బత్తి – పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బీజాపూర్(BIJAPUR) అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ఇంకా జరుగుతున్నట్లు భద్రతా దళాలు వెల్లడించారు.
నక్సల్స్ ఏరివేతలో భాగంగా జరుగుతున్న ఈ ఆపరేషన్‌లో డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్(DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) కోబ్రా దళాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి. ఈ భద్రతా బలగాల సభ్యులు ఛత్తీస్గడ్(CHHATTISGARH) అడవుల్లో వెతుకులాడుతున్న సమయంలో కాల్పులు జరిగాయని దీంతో పోలీసులూ ఎదురు కాల్పులు జరిపారని పోలీస్ అధికారి సుందర్ రాజ్ వెల్లడించారు.
ఈ ఎన్కౌంటర్లో(ENCOUNTER) హతమైన ఆరుగురు మృతదేహాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఆ అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్నట్లు వివరాలించారు.