Mother And Son Write 10th Exams : పెళ్లి, కుటుంబ సమస్యలు తదితర కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయిన చదువును తన కుమారుడితో కలిసి కంటిన్యూ చేస్తున్నారో తల్లి. కొడుకుతో కలిసి ఆమె కూడా పదో తరగతి పరీక్షలు రాయడానికి హాజరయ్యారు. ఇలాంటి అరుదైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. అక్కడి యాదగిరి జిల్లా సాగర గ్రామంలో ఈ తండ్రి కొడుకులు నివసిస్తున్నారు.
గంగమ్మ(32) అనే ఆమె తొమ్మిదో తరగతి వరకు చదువుకుని తర్వాత చదువు ఆపేశారు. అయితే పదో తరగతి పరీక్షలు రాసి సర్టిఫికెట్ సంపాదించాలని అనుకున్నారు. ఆమె కొడుకు సైతం ఇదే ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. దీంతో ఇప్పుడు కొడుకుతో కలిసి ఆమె కూడా పరీక్షలు రాస్తున్నారు. కర్ణాటకలో(karnataka) సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. దీంతో కొడుకు మల్లికార్జునతో పాటు తల్లి గంగమ్మ కూడా పరీక్ష సెంటరుకు హాజరవుతున్నారు.
ఈ విషయమై గంగమ్మ(gangamma) మాట్లాడుతూ.. తాను పదో తరగతి చదువుకున్నానని తర్వాత పెళ్లైందని చెప్పారు. అయినా స్కూలుకు వెళ్లాను కాని పదో తరగతి చదువుకోలేదన్నారు. ప్రస్తుతం తాను వాలంటీర్‌గా పని చేస్తున్నట్లు చెప్పారు. పదో తరగతి సర్టిఫికెట్ కోసం ఇప్పుడు పరీక్షలు రాస్తుండటం సంతోషంగా ఉందన్నారు.