గత రెండు రోజుల నుంచి నష్టాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు నేడు లాభాల బాట పడ్డాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170 పాయింట్లు లాభపడి 59,500 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ కూడా 45 పాయింట్లు పెరిగి 17,649కు చేరింది. ఐటీ, టెక్, టెలికామ్ సంస్థలు లాభాలతో మార్కెట్లను నడిపించాయి. ఇదిలా ఉండగా నేడు అదానీ గ్రూపు షేర్లు మరోసారి పతనం అయ్యాయి. గత రెండు రోజులుగా అదానీ గ్రూపు షేర్లు పతనం అవుతూ వస్తున్నాయి.
అలాగే బజాజ్ ఫైనాన్స్ 4.61 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.51 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.22 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 1.85 శాతం, ఎన్టీపీసీ 1.53 శాతం లాభాలను సాధించాయి. ఇకపోతే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3.38 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.56 శాతం, ఎల్ అండ్ టీ 2.11 శాతం, టాటా స్టీల్ 1.62 శాతం, హిందుస్థాన్ యూనిలీవర్ 1.55 శాతం నష్టాలను చవిచూశాయి.