MHBD: బయ్యారం మండలంలో వివిధ పార్టీలు, కుల సంఘాలు స్థానిక బస్టాండ్ సెంటర్లో చల్లా గోవర్ధన్ పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు స్థానిక ముత్యాలమ్మ దేవాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలన్నారు. ప్రధాన సూత్ర దారులపైనా కేసు నమోదు చేయాలన్నారు.