NGKL: లింగాల మండల కేంద్రంలో నేడు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఆంజనేయులు సోమవారం తెలిపారు. ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చదివిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంతటి గేట్ వద్ద తేజ కన్వెన్షన్లో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలను తీసుకువెళ్లాలని సూచించారు.