NLG: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈనెల 4 నుంచి 8 వరకు మున్సిపల్ కార్యాలయం ముందు జరిగే రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని శనివారం ఉదయం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీం పిలుపునిచ్చారు. రామగిరి, పానగల్ రోడ్డు, పాతబస్తీ చౌరస్తా మున్సిపల్ కార్మికుల హాజరు పాయింట్ వద్ద ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.