వికారాబాద్: తాండూర్ పట్టణంలో అక్టోబర్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని మహాసభల ఆహ్వాన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కోరారు. ఈసందర్భంగా శనివారం ఆయన తాండూర్ పట్టణంలో మహాసభల కరపత్రం విడుదల చేసి మాట్లాడారు. సభల్లో కార్మికులు, రైతులు, పేద ప్రజలు ఎదుర్కొటున్న సమస్యలను చర్చించనున్నట్లు తెలిపారు.