SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా గంగిరేణి చెట్టు ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. పట్నాలు, అభిషేకాలు, కల్యాణం మొదలగు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.