KMR: మత్స్యకారుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. చేప పిల్లలు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందని తెలిపారు. మత్స్యకారులు చెరువుల్లో వాటిని పెంచుకొని ఆర్థికంగా బలోపితం కావాలని చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, ధర్మరావు పేట మాజీ సర్పంచ్ శంకర్, నాయకులు పాల్గొన్నారు.