NGKL: బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఎస్టీ, సీఎఫ్ఎల్ ప్రాజెక్ట్ జిల్లా కోఆర్డినేటర్ శేఖర్ రెడ్డి అన్నారు. నేడు లింగాల మండలంలోని రాయవరం గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో గ్రామ స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లపై జాగ్రత్తలు, సైబర్ నేరగాళ్ల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలన్నారు.