NZM: జుక్కల్ మండలం విద్యాశాఖ అధికారిగా టి.తిరుపతయ్య గురువారం బాధ్యతలు స్వీకరించినట్లు నూతన ఎంఈఓ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు అందరూ సమయానికి పాఠశాలలకు వెళుతూ విద్యార్థులకు విద్యాబోధన చేయాలని, పాఠశాలల్లో సమస్యలు ఉంటే పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఉపాధ్యాయులు ముఖ్యంగా విద్యతో పాటు పౌష్టికాహారంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.