NZB: జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. దీంతో జిల్లాలోని రెంజల్ పొతంగల్, నవీపేట్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు నిరసనలు తెలుపుతున్నారు. కేంద్రాలను ఏర్పాటు చేయాలని సహకార సంఘ ఛైర్మన్లు సైతం తాసీల్దార్లకు వినతి పత్రాన్ని అందజేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.