NGKL: కుష్టు వ్యాధిని పూర్తిగా నివారించేందుకు ప్రతిఒక్కరు సహకరించాలని నాగర్ కర్నూల్ జిల్లా డిప్యూటీ వైద్యాధికారి వెంకట దాస్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీహాల్లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వైద్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే మందుల ద్వారా 6నెలలలో తగ్గుతుందన్నారు.