SRPT: దేశ రక్షణ బీజేపీ పార్టీతోనే సాధ్యమని బీజేవైఎం రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశంలోనే ఏ పార్టీకి లేని సభ్యత్వాలు బీజేపీ పార్టీకే ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి గడపగడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందన్నారు.