KCR అవినీతికి పాల్పడ్డారు.. అధికారం ఇవ్వండి, బయటకు తీద్దాం: రాహుల్ గాంధీ
ఆరోపణలు- ప్రత్యారోపణలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని కల్వకుర్తి విజయభేరి సభలో రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Rahul Gandhi: తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హాట్ కామెంట్స్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిని బయటకు తీసుకొద్దామని కోరారు. అవినీతి సొమ్మును బయటకు తీద్దామని.. ఆ సొమ్మును పేదలకు ఇద్దాం అంటున్నారు. కల్వకుర్తిలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొని, ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రంతో తమ కుటుంబానికి అనుబంధం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ మధ్య బంధం ఎలా ముగిసిందో రాహుల్ గాంధీ వివరించారు. ఇక్కడ 2 శాతం ఓట్లు మాత్రమే బీజేపీకి ఉందన్నారు. ఆ 2 శాతం ఓట్లతో సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారా అని అడిగారు. ప్రధాని మోడీ అమెరికా వెళ్లి ఓబీసీ అభ్యర్థిని అమెరికా అధ్యక్షుడిని చేస్తా అన్నట్టు ఉందని విమర్శించారు.
మజ్లిస్ కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని విమర్శించారు. ఆ పార్టీ ప్రభావం లేకున్నప్పటికీ.. మజ్లిస్ అభ్యర్థులను నిలబెడుతుందని చెప్పారు. వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గెలువకుండా.. బీజేపీ-బీఆర్ఎస్-మజ్లిస్ కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తొలుత 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ఆ తర్వాత దేశంలో బీజేపీని ఓడిద్దాం అని పిలుపునిచ్చారు.