BDK: పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో మాసశివరాత్రి సందర్భంగా ఆదివారం రుద్రహోమం పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. యాగశాలలో ఉదయం 9 గంటల నుంచి జరగనున్న హోమంలో పాల్గొనున్న భక్తులు రూ.1,516 చెల్లించి గోత్ర నామాములను నమోదు చేసుకోవాలని కోరారు.
NRPT: జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించ తలపెట్టిన నారాయణపేట జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన వాయిదా వేస్తున్నట్లు డీఈఓ గోవిందరాజు శుక్రవారం తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు, నిర్వహణ కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు సైన్స్ ఫెయిర్‌ను జనవరి 3, 4 తేదీలలో ఏర్పాటు చేయనున్నారు.
KNR: ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలను కుటుంబసభ్యులతో జరుపుకోవాలని జమ్మికుంట సీఐ వరగంటి రవి ఓ ప్రకటనలో తెలిపారు. రోడ్లపై కేక్ కటింగ్, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు బానిస కావద్దని ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని సూచించారు.
వరంగల్: కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతంలో చాలా రోజులుగా పులి సంచరిస్తున్న నేపథ్యంలో మండలంలోని ఓటాయి, కోనాపురం, సాదిరెడ్డిపల్లి పరిధిలోని అడవి ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. డీఎస్ఓ విశాల్ ఆదేశాల మేరకు కొత్తగూడెం అడవి ప్రాంతాన్ని ఎఫ్ఆర్డీ వాజహత్ క్షుణ్ణంగా పరిశీలించారు. పాదముద్రలు ఆధారంగా పులిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
HYD: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో శుక్రవారం ప్రజావాణిలో 154 అర్జీలు వచ్చాయి. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి 59, విద్యుత్ శాఖకు 26, రెవెన్యూ శాఖకు 18, హోం శాఖకు 8, వ్యవసాయ శాఖకు 5, ఇతర శాఖలకు సంబంధించి 38 అర్జీలు వచ్చాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
KNR: హుజురాబాద్ పట్టణంలో ACP శ్రీనివాస్ వాహనాలను తనిఖీలు చేయగా సరైన పత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ & డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ Dec 31 నుంచి Jan 1 వరకు ఉంటుందని అన్నారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వొద్దని సూచించారు.
NGKL: ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామంలోని కేఎస్ఐ కాల్వ భూములు కోల్పోయిన రైతులు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణని శుక్రవారం కలిశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అధికారులతో, కలెక్టర్‌తో మాట్లాడి భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగే విధంగా త్వరలో నిధులు విడుదల అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు.
SRCL: ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన కుర్ర సావిత్రిని ఏకలవ్య గ్లోబల్ ఫెడరేషన్ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినట్లు EGF వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కె.ఆంజనేయులు తెలిపారు. సావిత్రి మాట్లాడుతూ.. నాయకత్వ అనుభవంతో ఎరుకల జాతి అభివృద్ధికి కృషి చేస్తానని ఏకలవ్య గ్లోబల్ ఫెడరేషన్ EGF జాతి సంక్షేమం కోసం పని చేస్తానని చెప్పారు.
గద్వాల్: మల్దకల్ మండలం పావనం పల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెదురు బొంగులు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
HYD: మనిషిని సృష్టించిన భగవంతుడికి ఆ మనిషికి ఏది ఎంత ఇవ్వాలో తెలుసునని ప్రభుత్వ పూర్వ సలహాదారు డా. కె.వి.రమణాచారి పేర్కొన్నారు. ప్రముఖ సాంస్కృతిక సంస్థ రసరంజని హైదరాబాద్ ఆధ్వర్యంలో రాత్రి రవీంద్రభారతి ప్రధాన మందిరంలో రచన ఎం. దివాకరబాబు, దర్శకత్వం డా. వెంకట్ గోవాడ, ప్రధాన పాత్రలు పలువురు నటించిన భూతకాలం నాటకం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.
KNR: ఈరోజు సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం వద్ద గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈమేరకు బోయినపల్లి అంబేడ్కర్ చౌరసణాలో మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కన్వీనర్ శ్రీధర్, తదితరులు ఉన్నారు.
నల్గొండ: మంత్రి దనసరి అనసూర్య (సీతక్క)ని శుక్రవారం ఆలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇంజ నరేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలేరు నియోజకవర్గానికి ప్రభుత్వవీప్ బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారని సీతక్కకు వివరించారు. అలాగే అధిక నిధులు ఆలేరు నియోజకవర్గానికి కేటాయించాలని విన్నవించారు.
MNCL: పాత కక్షలతో ఒకరిని హత్యకు ప్రయత్నించిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రూరల్ CI అన్జలుద్దీన్ వివరాల ప్రకారం.. శివసాయి, జాడి శ్యామ్ రావులకు గతంలో పురుషోత్తం అనే వ్యక్తితో విబేధాలు ఉన్నాయి. దీంతో అతణ్ని హత్య చేయడానికి ముగ్గురుకి రూ.50వేలు సుపారి ఇచ్చాడు. ఈనెల 24న పురుషోత్తం కారులో వెళుతుండగా అతని కారు ఆపి బండరాళ్లతో తలమీద బాది పారిపోయారు.
నల్గొండ: చిట్యాల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం జరిపే టోకెన్ సమ్మె సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ డిమాండ్ చేస్తూ కనక దుర్గ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలన్నారు.
KMM: జిల్లాలోని 2.54 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు యాసంగిలో కళకళలాడనుంది. ఓవైపు జలాశయాల్లో పుష్కలంగా ఉన్న నీటికి తోడు సాగర్ జలాలు సైతం విడుదల చేస్తుండటంతో పంటల సాగుకు డోకా లేనట్లేనని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోనస్ అందుతుండటంతో రైతాంగం వరికే ప్రాధాన్యత ఇస్తోంది. ఆయకట్టుకు 34టీఎంసీల నీటిని కేటాయించగా ఈనెల 15 నుంచే విడుదలవుతున్నాయి.