మహబూబాబాద్: జిల్లా ప్రజలకు SP సుధీర్ రాంనాథ్ కెనన్ పలు సూచనలు చేశారు. ఇటీవల సైబర్ నేరగాళ్ల మోసాలు అధికంగా పెరిగిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే పంపి మోసపోవద్దని, సైబర్ నేరస్థుల వలలో చిక్కి డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు. ఎవరైనా ఈ విధంగా ఫోన్ చేస్తే వెంటనే 1930ను సంప్రదించాలని ఒక ప్రకటనలో కోరారు.
WNP: 2025 నూతన సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్న 2025 న్యూ ఇయర్ వేడుకలు, కుటుంబ సభ్యులతో, ఆనందోత్సవాల మధ్య ఎవరికి ఇబ్బంది కలగకుండా పండగ వాతావరణంలో జరుపుకోవాలని వనపర్తి టౌన్ ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. శాంతిభద్రతల దృష్టా ప్రశాంతతను పెంపొందించేందుకు జనవరి 1, 2025 వరకు 1861 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.
NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పర్యాటకులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భారీగా తరలివచ్చారు. నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రం, బుద్ధవనం, కృష్ణ నదిలో లాంచి విహారయాత్ర, ఎత్తిపోతలు, వాటర్ ఫాల్ తదితర ప్రాంతాల వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. రేపు ఆదివారం కావడంతో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉందని టూరిజం అధికారులు చెబుతున్నారు.
KMM: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కాసాని సీతారాములు శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. కూసుమంచి మండలం జీల్లాచెర్వు గ్రామానికి చెందిన సీతారాములు బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. వారి మృతిపట్ల జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ADB: నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామ అయ్యప్ప స్వాములు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో అయ్యప్ప సన్నిధానానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
WGL: నల్లబెల్లి మండలం రుద్రగూడెం పెద్ద తండా వద్ద మొక్కజొన్న చేనులో రైతులకు పులి దర్శనం ఇవ్వడంతో వారు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సిబ్బందితో ఘటన ప్రాంతానికి చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. పెద్దపులి కనిపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. రామాయంపేటలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, కాస్మెటిక్స్ సరఫరా చేయాలని, ఐదు నెలల వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్: జిల్లా ఏర్గట్ల మండలం దొంచందకి చెందిన పెద్ది రెడ్డి నవ్యకు ఇవాళ కాంగ్రెస్ నాయకుడు జిల్లా జనరల్ సెక్రటరీ పెద్ది రెడ్డి రవి రూ. 60 వేల CMRF చెక్కును అందించారు. అనంతరం చెక్కు అందుకున్న లబ్ధిదారుడు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి, లింగారెడ్డి, ఆశీరెడ్డి, నరేష్, ప్రకాష్, బీమయ్య తదితరులు పాల్గొన్నారు.
NZB: పోగొట్టుకున్న మొబైల్ ఫోనును మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తిరిగి బాధితులకు అప్పగించారు. నెల క్రితం మోర్తాడ్ గ్రామానికి చెందిన కొత్తూరు జగదీష్ తన మొబైల్ ఫోనును పోగొట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు CEIR పోర్టల్ ఆధారంగా పోయిన ఫోన్ ఆచూకీ కనిపెట్టి తిరిగి అప్పగించామని ఎస్సై విక్రమ్ తెలిపారు.
HYD: మురుగునీటి శుద్ధిలో అత్యున్నత ప్రమాణాల నిర్వహణ నేపథ్యంలో పకడ్బందీ పర్యవేక్షణ విధానానికి జలమండలి శ్రీకారం చుడుతోంది. హైదరాబాద్, చుట్టుపక్కల ఇప్పటి వరకు 36 మురుగునీటి శుద్ధి కేంద్రాలు(STPలు) అందుబాటులోకి రాగా మరో 9 STPల పనులు జరుగుతున్నాయి.
ADB: మావల మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న కార్‌కు మావల జాతీయ రహదారిపై కుక్క అడ్డు వచ్చింది. దానిని తప్పించబోయే క్రమంలో పక్కనున్న చెట్ల పొదల్లోకి కారు దూసుకు పోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పవన్, ప్రవీణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
మేడ్చల్: ఉప్పల్ పరిధి లక్ష్మణ్ కాలనీ, రాఘవేంద్రనగర్ కాలనీ, గాయత్రీనగర్ ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద వేధిస్తోంది. రాత్రి అయితే చాలు పదుల సంఖ్యలో వీధి కుక్కలు రోడ్లపైకి వచ్చి అరుస్తున్నాయని వాపోతున్నారు. రాత్రి పూట బయటకు రావాలంటే భయమేస్తోందన్నారు. కుక్కలను పట్టుకుని తీసుకెళ్లాలని స్థానికులు కోరారు.
SRCL: వేములవాడ పట్టణంలో ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అక్కడ ఆయన చేతిపై ఓ చిలుక వచ్చి వాలింది. చేతిపై ఉన్న గడియారాన్ని చిలుక ఆసక్తిగా చూస్తూ కాసేపు ఉండటంతో కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనం సందడి ఉన్నప్పటికీ ఎమ్మెల్యే చేతిపై చిలుక వాలడం వింతగా ఉందని నాయకులు ఆ సన్నివేశాన్ని ఆసక్తిగా చూశారు.
MBNR: ఉన్నత లక్ష్యం నిర్ణయించుకొని అందుకు అనుగుణంగా మంచిగా చదువుకొని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ బీసీ సంక్షేమ హాస్టల్‌ను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్లో గ్రంథాలయం లేదని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా కొత్త సంవత్సరం ప్రారంభించుకుందామన్నారు.
WGL: వరంగల్ కలెక్టరేట్‌లో శనివారం ఉదయం 11 గంటలకు స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశరదా ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు, వయోవృద్ధులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు స్పెషల్ గ్రీవెన్స్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.