PDPL : కాంగ్రెస్ కార్యకర్తలా పనిచేస్తున్న పోలీసులు, తమ పద్ధతిని మార్చుకోకపోతే పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మంథనిలో మీడియాతో మాట్లాడుతూ.. రామగుండం, మంచిర్యాల ఏసీపీలు దేశంలోనే అత్యున్నతమైన పోలీస్ శాఖకు మచ్చ తెచ్చారని ఆరోపించారు.
ASF: సీఆర్టీలకు సమస్యలను ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ డిమాండ్ చేశారు. ఉట్నూర్ పట్టణంలోని ఐటిడిఐ కార్యాలయం ఆవరణలో సమ్మె చేస్తున్న సిఆర్టిలకు శనివారం ఆమె మద్దతు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు చెల్లించాలని కోరుతూ సిఆర్పీలు సమ్మె చేస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.
BDK: మణుగూరు మండలం రామానుజరంలో నిర్వహించిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు హాజరుకావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కమ్యూనిస్టు పార్టీ అంటే పేద ప్రజల హక్కుల కోసం పోరాడే పార్టీ అని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ అంటే తనకు ఎంతో అభిమానం అని పేర్కొన్నారు.
ADB: పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మె చేపట్టిన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం సంఘీభావం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
HYD: ఫతేనగర్ డివిజన్ పరిధిలోని గాంధీపురంలో రూ. 20 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను GHMC డీఈ స్రవంతితో కలిసి కార్పొరేటర్ సతీష్ గౌడ్ పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తామని సాధ్యమైనంత త్వరగా పనులన్నీ పూర్తి చేసి, కాలనీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.
GDWL: ఆర్యవైశ్య సంఘం-2025 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. పట్టణంలో వెలిసిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆర్యవైశ్య సంఘం నేతలు సాదరంగా ఆహ్వానించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో క్యాలెండర్‌ను ఆవిష్కరణ చేశారు.
BDK: తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కమీషనర్ వీపీ గౌతమ్ శనివారం దుమ్ముగూడెం మండలం నడికుడి గ్రామ పంచాయతీలో పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును పరిశీలించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న సర్వే వివరాలను పంచాయతీ కార్యదర్శి రంజితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పీవో రాహుల్, మండల అధికారులు పాల్గొన్నారు.
MBNR: నవాబుపేట కేంద్రంలోని కస్తూరిభా గాంధీ పాఠశాల విద్యార్థులకు గత 20 రోజులుగా ఉపాధ్యాయులు రాక, చదువు చెప్పే వారు లేక విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలని, వార్షిక పరీక్షలు దగ్గర వచ్చాయని విద్యార్థులు వాపోయారు. మమ్మల్ని చదువులకు దూరం చేయవద్దని తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో జయరాం నాయక్, ఎస్సై విక్రమ్‌లను కోరారు.
NZB: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జనవరి 8న బీసీ విద్యార్థి సమర శంఖారావం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను శనివారం కేర్ డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు.
NLG: వేప చెట్టులో రావి చెట్టు కొమ్మలు పెరిగి ఉండడంతో ఈ అద్భుత దృశ్యాన్ని శనివారం కోదాడ పట్టణ ప్రజలు ఆసక్తికరంగా తిలకించారు. ఈ సంఘటన కోదాడ మెయిన్ రోడ్ పక్కనే అంజలి టీ స్టాల్ ఎదురుగా ఉన్న వేప చెట్టులో కనిపించింది. ఒక వృక్షం, మరొక వృక్షానికి పొంతన లేని విధంగా కనిపించడం ఆశ్చర్యకరంగా ఉన్నది. ఈ వింత దృశ్యాన్ని చూసిన కొందరు ప్రజలు సెల్ ఫోన్‌లో బంధించారు.
BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ఎస్పీ రోహిత్ రాజ్ శనివారం పలు సూచనలు చేశారు. ఇటీవల సైబర్ నేరగాళ్ల మోసాలు అధికంగా పెరిగిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే పంపి మోసపోవద్దన్నారు. ఎవరైనా అలా ఫోన్ చేస్తే వెంటనే 1930ను సంప్రదించాలని కోరారు.
NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలో తమను క్రమబద్ధీకరించాలంటూ కేజీబీవీ ఉపాధ్యాయులు నిరవధిక దీక్ష చేపట్టగా… శనివారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ దీక్షా స్థలికి వచ్చి వారికి మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉద్యోగులు తమను క్రమబద్ధీకరించాలని పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
WGL: వరంగల్‌కు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(NASSCOM) శుభవార్త చెప్పింది. HYD తర్వాత వరంగల్ నగరం గ్లోబల్ కేపబిలీటీ సెంటర్ల(జీసీసీ)కు డెస్టినేషన్‌లుగా మారనున్నాయని తెలిపింది. జిల్లాలో ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజినీరింగ్ కాలేజీలు, మానవ వనరులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.
JGL: కోరుట్ల మండలంలోని కల్లూరు కస్తూర్బా గాంధీ విద్యాలయ బాలికలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు సమ్మెకు వెళ్లడంతో అధికారులు తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కేటాయించారు. దీంతో తమ ఉపాధ్యాయులు తమకే కావాలని బాలికలు పాఠశాల ఆవరణలో బైటాయించి నిరసన తెలిపారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు నచ్చజెప్పి క్లాసులకు పంపించారు.
HYD: ఈసీఐఎల్ చౌరస్తాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లాపూర్ డివిజన్‌కు చెందిన కార్మిక సంఘం నాయకుడు మారుతీరావును ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శనివారం పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, కాసం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.