WGL: విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ పూర్తి చేసి 990 మార్కులు సాధించిన ముత్యాల రక్షితను శనివారం ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్‌లో మరింత కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని రక్షితకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.
HYD: మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులని అడ్డుకోలేకున్నారు. తాజాగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.
WGL: నల్లబెల్లి మండల పరిధి రుద్రగూడెం తండా శివారులో పులి పాదముద్రలను నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. పాద ముద్రల ఆధారంగా పులి ఉన్న స్థావరాన్ని గుర్తిస్తామని చెప్పారు. పులుల భయం నుంచి ప్రజల్లో రక్షించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
HYD: వీధి వ్యాపారులను ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పెట్టడం సరికాదని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంట్రోల్ రూమ్ వద్ద పలువురికి ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించి, తోపుడుబండ్లను అదుపులోకి చేసుకున్నారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడిన ఎమ్మెల్సీ తోపుడుబండ్లను విడిపించారు.
MHBD: జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్‌ను నేడు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన పలువురు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కానిస్టేబుల్స్‌గా పని చేస్తున్న పలువురికి హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతి బాధ్యతను మరింతగా పెంచుతుందని గుర్తించాలని సూచించారు.
MDK: శివంపేట మండలం సికింద్లాపూర్ గ్రామంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శనివారం 13వ రోజు సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజలు నిర్వహించారు. స్వామివారిని రంగురంగుల పూలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
HNK: పబ్లిక్ గార్డెన్‌లో బీఆర్ఎస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. 1947 నుంచి మిమిక్రీ ప్రదర్శనలకు శ్రీకారం చుట్టాడని, వరంగల్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి, ఓరుగల్లు కీర్తి ప్రతిష్టలను పెంచాడన్నారు.
KMR: గాంధారి మండలం పెద్ద పోతంగల్, మేడిపల్లి గ్రామాల మధ్య ఉన్న బుగ్గగండి రోడ్డు శిథిలావస్థకు చేరడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందించి అధికారులు, కాంట్రాక్టర్‌తో మాట్లాడి రోడ్డు సమస్యను పరిష్కరించాలన్నారు. శనివారం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
MDK: కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో స్వయంభు వెలసిన శ్రీ శనీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శని త్రయోదశి శనివారం పురస్కరించుకొని ఆలయ పూజారి ఉమామహేశ్వర శర్మ చేతుల మీదుగా స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు, తైలాభిషేకం, అర్చనలు జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విశేష పూజలు చేశారు.
KMR: పాల్వంచ మండలం మంథని దేవునిపల్లి గ్రామానికి చెందిన గుండెల్ని దేవరాజు(39) పని నిమిత్తం కామారెడ్డికి వెళ్లారు. పాల్వంచలోని చామల కుంటలో కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో మునిగిపోయారు. దీంతో ఊపిరాడక చనిపోయారు. ఆయన భార్య గుండెల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తునట్లు ఎస్ఐ అనిల్ పేర్కొన్నారు.
WNP: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. శనివారం వీపనగండ్ల PHCని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపి, డెలివరీల రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
MDK: కల్వకుంట గ్రామానికి చెందిన ఉషన్న రామయ్య శనివారం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, నియోజకవర్గ ఇంఛార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఈ రోజు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఆయన రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. కల్వకుంట సొసైటీ ఛైర్మన్ కోండల్ రెడ్డి తన వంతుగా రూ.3 వేలు అందజేశారు.
SRPT: తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన సంకినేని చిలుకమ్మ ఇటీవల మరణించగా వారి చిత్రపటానికి శనివారం ఎమ్మెల్యే సామేలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, గుండగాని మహేందర్, తొట్ల శ్రీను, దాసరి శ్రీను తదితరులు ఉన్నారు.
NLG: బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలోని సర్వే నెంబర్ 506లోని భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న చర్చిని నిలిపివేయాలని గ్రామ యువకులు బొమ్మలరామారం ఎమ్మార్వోకు శనివారం వినతిపత్రం అందజేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శికి కూడా వినతిపత్రం అందజేశామని వారు తెలిపారు. భువనగిరికి వెళ్లే దారిలో నిర్మాణం చేస్తున్నారని తెలిపారు.
WGL: నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు తీసుకున్న ముందస్తూ చర్యలతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు అదుపులో వుండటంతో పాటు తగ్గు ముఖం పట్టినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ మీడియా సమావేశంలో తెలియజేసారు. పోలీస్ కమికషనర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ 2024కు సంబంధించి క్రైమ్ రౌండప్ మీడియా సమావేశాన్ని శనివారం కమిషనరేట్&z...