GDWL: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఆర్థిక భరోసా అందిస్తున్నట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత పేర్కొన్నారు. గట్టు మండలం తుమ్మలచెరువు వాసి కురువ శివారెడ్డి చికిత్స నిమిత్తం మంజూరైన రూ.60 వేల చెక్కును ఆమె అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.