MDCL: పోచారం పరిధి అన్నోజిగూడ ప్రాంతంలో స్వచ్ఛమైన కల్లు దొరకటం కష్టమేనని అక్కడికి వెళ్లిన ఎంతో మంది చెబుతున్నారు. తాటికల్లు లభ్యం కానప్పటికీ, కొన్ని పదార్థాలను కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరోవైపు ఈత కల్లులోనూ పౌడర్ లాంటివి కలుపుతున్నారని పేర్కొన్నారు. ఘట్కేసర్ చుట్టూర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుందన్నారు.