NGKL: ఉప్పునుంతలకు చెందిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మేడమోని మల్లేష్ ‘నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ భారత్ విభూషణ్ అవార్డు-2026కు ఎంపికయ్యారు. శనివారం కలెక్టర్ సంతోష్, డీఈఓ రమేష్ కుమార్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ట్రైనర్‌గా వందలాది మంది విద్యార్థుల్లో సానుకూల మార్పు తెచ్చినందుకు గాను మల్లేష్‌ను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు.