NGKL: అచ్చంపేట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఐఎన్టీయూసీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నామని ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ, అమ్రాబాద్ మాజీ జడ్పీటీసీ అనురాధ, అచ్చంపేట పురపాలక చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు హాజరుకానున్నారని తెలిపారు.