ASF: వాంకిడి మండలం ఖమనకి చెందిన లోబడే విమల కుమార్తె లలితతో కలసి పురుగుమందు డబ్బతో MRO ఆఫీస్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 1950 నుంచి సాగు చేసుకుంటున్న భూమిని తమకు తెలియకుండా అధికారులు ఇతర పేర్ల మీద మార్చారని ఆరోపించారు. తమకు తమ భూమి ఇవ్వాలని పురుగు మందు తాగేందుకు సిద్ధం కాగా, అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు.