NRPT: మాగనూర్ మండల కేంద్రంలో మధ్యాహ్నం భోజనం లోపం వల్ల జరిగిన పరిణామాలకు ఉపాధ్యాయులను బలి చేయటం సరికాదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేర్ కృష్ణారెడ్డి నరసింహ అన్నారు. గురువారం నారాయణపేటలో విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలో లేదా వంట చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.