ములుగు మండలం బండారుపల్లిలోని ప్రభుత్వ ఆదర్శ (మోడల్) పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 6 నుంచి 10వ తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 6వ తరగతికి ఉదయం 11 గంటలకు, 7–10 తరగతులకు మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది.