JGL: ఉచిత కుట్టు మిషన్లకై క్రిస్టియన్ మైనారిటీ మహిళల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఆర్ఎస్. చిత్రు తెలిపారు. కనీసం 5వ తరగతి చదివి ఆధార్ కార్డు కలిగి ఉండి వయసు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య గలవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 20 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.