SRPT: చివ్వెంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏథేచ్ఛగా ధాన్యం కుప్పలను కొందరు ఆరబోసినారు. దీంతో నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు నామినేషన్లు ఉన్నప్పటికీ ధాన్యం పోసేందుకు పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. మానవత్వంతో రైతులకు సహకరించినప్పటికీ నామినేషన్ల సమయంలో కూడా అధికారులు తొలిగించకపోవడంతో విమర్శలకు దారీ తీసింది.