మెదక్ మండలం సంగాయిగూడ తాండ శివారులోని హల్దిబాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్న రెండు హిటాచీలు, ఒక టిప్పర్ వాహనం పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ దయానంద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిషోర్ ఆధ్వర్యంలో హల్దీ వాగు వద్ద దాడులు చేసినట్టు తెలిపారు. కేసు నమోదు చేసినట్టు వివరించారు.