గద్వాల్ మున్సిపాలిటీ 37 వార్డులకు సంబంధించిన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో MLA కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.