MNCL: జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో అమరులైన అటవీ సిబ్బందికి గురువారం నివాళులర్పించారు. FRO పూర్ణచందర్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది మౌనం పాటించారు. విధి నిర్వహణలో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్న అటవీ అధికారులను స్మరించుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు.