MDK: వంద శాతం రుణమాఫీ చేశామని చెప్పడం సరికాదని సీపీఐ మాజీ రాష్ట్ర సమితి సభ్యులు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దయానంద రెడ్డి అన్నారు. జగదేవపూర్ మండలంలోని తీగుల్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 25 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి, 100% రుణాలను మాఫీ చేశామని చెప్పడం సరికాదన్నారు.