WNP: గోపాల్ పేట మండలం తాడిపర్తిలో గ్రామపంచాయతీ కార్యాలయానికి సమీపాన ఉన్న గ్రంథాలయం నిరుపయోగంగా ఉంది. పదేళ్ల క్రితం గ్రామ మాజీ సర్పంచ్ గ్రామంలోని నిరుద్యోగులు, విద్యార్థుల కోసం గ్రంథాలయాన్ని ప్రారంభించారు. నేడు గ్రంథాలయంలో భద్రత సిబ్బంది లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. అధికారులు చొరవ తీసుకుని గ్రంథాలయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.