MBNR: భూత్పూర్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులోని పంట పొలాల్లో శనివారం ఓ అమ్మాయి కాలిన గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. బాధితురాలి వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా నర్సింగాపూర్ తండాకు చెందిన యువతిగా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.