NGKL: ఎన్నికల హామీ ప్రకారం NGKL పార్లమెంటు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎంపీ మల్లురవి అన్నారు. గురువారం ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి అచ్చంపేటలో మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి కల్పన అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అవకాశాలు కల్పిస్తామన్నారు.