MBNR: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయకపోతే ఉద్య మిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. శనివారం వనపర్తి జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ. 32 వేల కోట్లతో 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 74 వేల కోట్లు అని విమర్శించారు.