MDK: నర్సాపూర్ మండలం జక్కపల్లి సమీపంలో గల అదర్శ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఫర్హానా ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతితో పాటు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.