KMM: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌తో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా రాజ్యసభలోని ఛైర్మన్ ఛాంబర్ కు ఎంపీ రవిచంద్ర సోమవారం ఉదయం వెళ్లి ధన్‌ఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు ఎంపీ తెలిపారు.