మెదక్ పట్టణంలో ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మక్త భూపతిపూర్‌కు చెందిన చిటికెల అశోక్ అనే వ్యక్తి రామనగర్‌లో సోమవారం ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అధిక వడ్డీకి అప్పు ఇచ్చిన వ్యక్తులు బలవంతంగా తన కారును లాక్కెళ్లడంతో మనస్థాపం చెంది పురుగు మందు తాగినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.