KMR: జుక్కల్ నియోజకవర్గంలో సోయా ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అసెంబ్లీలో కోరారు. ఇక్కడ సోయా పంట అత్యధికంగా పండుతుందని, అయితే గిట్టుబాటు ధర లేక రైతులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దు ప్రాంతమైన జుక్కల్‌లో యూనిట్ నెలకొల్పితే స్థానిక రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.