SRPT: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. ఆదివారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు.