BDK: జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల మద్యం దళారులు సిండికేట్‌గా ఏర్పడి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని మంగళవారం డిప్యూటీ కమిషనర్‌కు ఏజెన్సీ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు లాల్ సింగ్ నాయక్ వినతిపత్రం సమర్పించారు. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలో గిరిజన చట్టాలకు విరుద్ధంగా మారుమూల తండాల్లో దందా నడుస్తుందన్నారు.